BSNL Budget Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) అతి తక్కువ ధరలో కూడా రీఛార్జ్ ప్లాన్లు ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికాం కంపెనీగా ఎప్పుడూ నిలుస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్లు కేవలం రూ. 200 రూపాయల కంటే కూడా తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే ప్లాన్లను రీఛార్జ్ చేయొచ్చు. ఈరోజు అటువంటి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చూద్దాం. Survey ✅ Thank you for completing the surv
BSNL Budget Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) అతి తక్కువ ధరలో కూడా రీఛార్జ్ ప్లాన్లు ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికాం కంపెనీగా ఎప్పుడూ నిలుస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్లు కేవలం రూ. 200 రూపాయల కంటే కూడా తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే ప్లాన్లను రీఛార్జ్ చేయొచ్చు. ఈరోజు అటువంటి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చూద్దాం. Survey Thank you for completing the survey! BSNL Budget Plan: ఏమిటా ప్లాన్స్? రూ. 200 కంటే తక్కువ రేటుకే మంచి ప్రీపెయిడ్ ప్లాన్ లను బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందించింది. వాటిలో మొదటిది రూ. 153 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కాగా రెండోది రూ. 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అవుతుంది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా చెప్పబడతాయి. బిఎస్ఎన్ఎల్ రూ. 153 ప్లాన్ ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసిన అతి చవక అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 24 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 1 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఇది కాకుండా డైలీ 100 SMS మరియు డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఓవరాల్ గా ఈ ప్లాన్ తో 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్ ఇది 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 200 కంటే తక్కువ రేటుకే లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందుకుంటారు. ఇది కాకుండా ఈ ప్లాన్ తో డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 28 రోజులు అన్లిమిటెడ్ డేటా అందుకుంటారు. Also Read: Thomson Air Cooler: బడ్జెట్ ధరలో కొత్త ఫీచర్స్ తో కొత్త కూలర్లు లాంచ్ చేసిన థామ్సన్.! రూ. 200 కంటే కొంచెం ఎక్కువ రేటుతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్స్ కూడా గొప్ప లాభాలు యూజర్లకు అందిస్తాయి.
