Vivo T5 Pro 5G: వివో టి సిరీస్ నుంచి ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ టి 5 ప్రో ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ను ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని 9020 mAh బ్యాటరీ మరియు Snapdragon 7 Gen 4 చిప్ సెట్ వరకు చాలా విభాగాల్లో ప్రీమియం ఫీచర్స్ తో ఈ ఫోన్ […]
Vivo T5 Pro 5G: వివో టి సిరీస్ నుంచి ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ టి 5 ప్రో ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ను ప్రీమియం ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో విడుదల చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని 9020 mAh బ్యాటరీ మరియు Snapdragon 7 Gen 4 చిప్ సెట్ వరకు చాలా విభాగాల్లో ప్రీమియం ఫీచర్స్ తో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. Survey Thank you for completing the survey! Vivo T5 Pro 5G: ప్రైస్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ కలర్ వేరియంట్ వివో టి 5 ప్రో (8GB + 128GB) ప్రైస్ : రూ. 29,999 వివో టి 5 ప్రో (8GB + 256GB) ప్రైస్ : రూ. 33,999 వివో టి 5 ప్రో (12GB + 256GB) ప్రైస్ : రూ. 33,999 ఈ స్మార్ట్ ఫోన్ గ్లేషియర్ బ్లూ మరియు కాస్మిక్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. సేల్ అండ్ ఆఫర్స్ ఈ స్మార్ట్ ఫోన్ పై రెండు బిగ్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఒకటి రూ. 3,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రెండోది రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. వేరియంట్ ను బట్టి ఈ ఆఫర్ అమౌంట్ మారుతుంది.
HDFC, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ వివో ఫోన్ కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, పైన తెలిపిన రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే లభిస్తుంది. Also Read: BSNL Budget Plan: కేవలం రూ. 200 ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.! Vivo T5 Pro 5G: ఫీచర్స్ వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ 8.25mm మందంతో కొంచెం మందంగా ఉన్నా ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీతో పోలిస్తే మంచి స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు చూడొచ్చు. ఈ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది 1.2 Mn+ AnTuTu స్కోర్ అందించే ఫాస్ట్ చిప్ సెట్. దానికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగి సెల్ఫీ మరియు మెయిన్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ప్రత్యేకమైన వివో కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 9020 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఇందులో 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో అందించింది. కూలింగ్ కోసం ఈ ఫోన్ లో పెద్ద VC కూలింగ్ సిస్టం కూడా ఉంది. ఇది మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మరియు IP68 అండ్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120FPS గేమింగ్ అందించే డిస్ప్లే , మంచి కూలింగ్ సిస్టం, అతి భారీ బ్యాటరీ, వేగవంతమైన పెర్ఫార్మెన్స్ అందించే బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టిందని ఈ ఫోన్ గురించి చెప్పవచ్చు.
